భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..తెలంగాణలో ఫిబ్రవరి 24 నుంచి ఇంటర్ పరీక్షలు?….
తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అనివార్య కారణాల వల్ల కుదరకపోతే, మార్చి 3 నుంచి పరీక్షలు ప్రారంభించే ప్రత్యామ్నాయ షెడ్యూల్ను కూడా సిద్ధం చేశారు. అలాగే ఫస్టియర్ సైన్స్ విద్యార్థులకు కూడా ఫిబ్రవరి 1 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఎండలు, ఇతర ప్రవేశ పరీక్షల దృష్ట్యా ఈ మార్పులు చేపడుతున్నట్లు సమాచారం. బోర్డు నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
