భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..రాప్తాడు నిందితుడికి తీవ్ర అస్వస్థత కర్నూలు ఆసుపత్రికి తరలింపు.
రాప్తాడులో బాలికపై రంపంతో దాడికి తెగబడిన నిందితుడు హేమంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో మెరుగైన వైద్యం కోసం అతడిని అనంతపురం నుంచి కర్నూలు ఆస్పత్రికి తరలించారు. అతనికి పల్మనరీ ఎంబాలిజం సమస్య తలెత్తగా 3 రోజుల క్రితం మంచం మీద నుంచి కింద పడ్డాడు. అప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. 13 రోజుల నుంచి హేమంత్‌కు అనంతపురం GGHలో చికిత్స అందించారు.
