మెగాస్టార్ చిరంజీవిని కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మెగాస్టార్ చిరంజీవిని కలిసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి….

హైదరాబాద్‌లో శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. నవంబర్ 25 నుంచి 27 వరకు నగరంలో జరగనున్న ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆయన చిరంజీవిని ఆహ్వానించారు.

దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల నిర్మూలన కోసం చేపడుతున్న ఈ భారీ వాక్‌థాన్‌లో, యువతను చైతన్యపరిచేందుకు చిరంజీవి భాగస్వాములు కానున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. డ్రగ్స్ లేని ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రజలందరూ ఈ ఉద్యమంలో ఐక్యంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు…..