భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……భారీగా తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,310 తగ్గి రూ.1,38,490కి చేరగా, గత నాలుగు రోజుల్లో మొత్తం రూ.6,110 మేర ధర తగ్గింది.

అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 తగ్గి రూ.1,26,950గా ఉంది. మరోవైపు, కిలో వెండి ధర రూ.2,00,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఈ ధరలపై 3% GST అదనంగా వర్తిస్తుందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు…..