భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..జనసేన లోకి వైసీపీ నుండి ముఖ్య నాయకుడు ….వైసీపీకి యనమల కృష్ణుడు రాజీనామా.. జనసేన అధినేత పవన్ సమక్షంలో పార్టీ లో చేరిక

Ammiraju Udaya Shankar.sharma News Editor…కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీకి యనమల కృష్ణుడు రాజీనామా చేశారు. అనంతరం జనసేన పార్టీలో ఆయన చేరారు. శుక్రవారం రాజధాని అమరావతిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో యనమల కృష్ణుడు చేరారు. ఆయనకు కండువా కప్పి.. పార్టీలోకి పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. 2024 ఎన్నికల్లో యనమల కృష్ణుడికి టీడీపీ టిక్కెట్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడి సోదరుడే కృష్ణుడు
గత మూడు రోజులుగా వైసీపీలో రాజీనామాలు జోరందుకున్నాయి. నిన్న (గురువారం) నంద్యాలలో మాజీ సర్పంచ్‌తోపాటు దాదాపు 200 మంది నేతలు, కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేశారు. అనంతరం వారంతా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే మొన్న (బుధవారం) విజయనగరం జిల్లాలో వైసీపీకి చెందిన పలువురు జడ్పీటీసీలు.. ఆ పార్టీకి రాజీనామా చేశారు.
అనంతరం వారంతా టీడీపీలో చేరారు. వీరంతా విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అనుచరులు. జిల్లాలోని పలువురు నేతలతోపాటు కేడర్.. వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు ఓ చర్చ సాగుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు మజ్జి శ్రీనివాసరావు సమీప బంధువు. వైసీపీకి ఆయన రాజీనామా చేయడంతో విజయనగరం జిల్లాలో పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు అగ్రనాయకత్వం సిద్దమవుతున్నట్లు ఓ ప్రచారం సాగుతోంది.
