వినాయకుని నిమజ్జనంలో సాంప్రదాయ కళలను ఏర్పాటు చేయడం అభినందనీయం

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.కోడూరు
వినాయకుని నిమజ్జనంలో సాంప్రదాయ కళలను ఏర్పాటు చేయడం అభినందనీయం

లంబోదర యూత్ సభ్యులను అభినందించిన డి.ఎస్.పి అభిషేక్.

మహారాష్ట్ర కళాకారులతో కలిసి డప్పు వాయిద్యాలు కొట్టిన డిఎస్పి, సిఐ, ఎస్ఐ.

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని కోడూరు మండలంలో కోడూరు ప్రధాన సెంటర్లో లంబోదర యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని నిమజ్జన కార్యక్రమాన్ని మహారాష్ట్ర చెందిన పూణే కళాకారులతో తీర్మారు డప్పు కళాకారులతో నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులతో కలిసి అవనిగడ్డ డిఎస్పీ అభిషేక్ అవనిగడ్డ సీఐ యువ కుమార్ ఎస్సై చాణిక్యాలు డప్పు వాయిద్యాలు కొడుతూ యువకులను ఉత్సాహపరిచారు. వినాయకుని నిమజ్జనం లో డీజీలు వాడకుండా సాంప్రదాయ కలలను వాడడం అభినందనీయమని ఈ సందర్భంగా లంబోదర యూత్ సభ్యులను అవనిగడ్డ డీఎస్పీ అభిషేక్ అభినందించారు.