పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగావిద్యార్థుల ర్యాలీ

పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగావిద్యార్థుల ర్యాలీ

భారత్ డిజిటల్ న్యూస్ పాకాల,సెప్టెంబర్25)పాకాల మండలం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు కళాశాల నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు శుక్రవారం ఉదయం 10:30 గంటలకు ర్యాలీ నిర్వహించారు.కళాశాల ప్రిన్సిపాల్ వద్దని నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీప కూడలిలో విద్యార్థు మానవహారంతో మాకు న్యాయం కావాలి అని నినాదాలు చేసారు.తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సుజాత మీడియాతో మాట్లాడారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ స్కాలర్ షిప్ డబ్బులను ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం విద్యార్థులకు చెల్లిస్తున్నట్లు తెలిపారు.కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు గడిచిందని,ఈ కాలంలో 30 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు చెల్లించామని,మిగిలిన వారికి నిబంధనల ప్రకారం చెల్లిస్తామని తెలియజేశారు.టి.సిలు తీసుకోవాల్సిన విద్యార్థులు నిబంధన ప్రకారం కళాశాల ఐడీ కార్డు,ఆధార్ కార్డు,ఫీజు చెల్లించిన రసీదులు కలిగి ఉంటే వారికి టీ.సీలు అందిస్తున్నట్లు చెప్పారు.కళాశాలలో అధ్యాపకుల కొరత ఉండడంతో విద్యార్థులు కళాశాల రూముల్లో అల్లరి చేస్తుంటే,ప్రిన్సిపాల్ గదిలో కూర్చొని చదువుకోమని చెప్పానే తప్ప,విద్యార్థులను వేధించలేదని వివరించారు.విద్యార్థుల చదువుతోపాటు,క్రమశిక్షణ చాలా అవసరమని,క్రమశిక్షణ విషయంలో బాధ్యతగా కఠినంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు.దీనిని కొంతమంది విద్యార్థులు అపార్థం చేసుకుంటున్నారని,మాకు విద్యార్థులు బిడ్డలతో సమానమని,విద్యార్థుల ను తాను ఎందుకు వేధిస్తానని తెలిపారు.