భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు….గుంటూరు పట్టణంలో బియ్యం విక్రయాలపై అధికారుల విస్తృత తనిఖీలు:
గుంటూరు హౌసింగ్ బోర్డ్ కాలనీ నందలి గ్రేట్ ఇండియా రైస్ కంపెనీ నందు సివిల్ సప్లయ్స్ అధికారులు, లీగల్ మెట్రాలజీ అధికారులు కలిసి తనిఖీలు చేపట్టినారు. నిర్ణీత ధరల కంటే అధిక ధరలకు బియ్యం విక్రయాలను అమ్ముతున్న వ్యాపారస్తులపై కేసులు నమోదు చేయుచున్నారు. ఇందులో భాగంగా జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీమతి కోమలి పద్మ, తూనికలు కొలతలు అధికారి శ్రీ సైదా గారు, విజిలెన్స్ కమిటీ మెంబర్ శ్రీ చదలవాడ హరిబాబు మరియు గుంటూరు పట్టణ సివిల్ సప్లయ్స్ డిప్యూటీ తహశీల్దార్లు బేగ్ మరియు వెంకట్రావు గార్లు పాల్గొన్నారు.
