నేటి నుంచి చేనేతలకు కొత్త పెన్షన్ల పంపిణీ

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..నేటి నుంచి చేనేతలకు కొత్త పెన్షన్ల పంపిణీ!

T.G :తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన చేనేత కార్మికులకు పెన్షన్ల పంపిణీని చేపట్టనుంది.

ఈ ప్రక్రియ గురువారం (నవంబర్ 12) నుంచి ఈ నెల 18 వరకు కొనసాగనుంది.

ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సెర్ప్ సీఈవో అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిశీలించి, పారదర్శకంగా పంపిణీ చేయాలని సూచించారు.

ఈ మేరకు మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలు అందజేయనున్నారు.