కూటమి ఐక్యతతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…కూటమి ఐక్యతతోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అవనిగడ్డ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్న సందర్భంగా అవనిగడ్డ ప్రధాన సెంటర్లో బుధవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ల చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు.

తెలుగుదేశం పార్టీ అవనిగడ్డ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు అధ్యక్షతన నాయకులు విక్కుర్తి రాంబాబు పర్యవేక్షణలో తొలుత ఒకటవ వార్డులోని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి కాలినడకన ర్యాలీగా విక్కుర్తి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావులు కార్యక్రమం వద్దకు చేరుకున్నారు. వారి వెంట కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాలు చేతపట్టి, కూటమి ఐక్యత వర్ధిల్లాలి అంటూ…. పెద ఎత్తున నినాదాలు చేశారు.

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రతిమకు విక్కుర్తి, కనపర్తి, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావులు పూలమాలలతో నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా విక్కుర్తి మాట్లాడుతూ, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల సారధ్యంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకు వెళుతుంది అన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో శాశ్వత సమస్యలపై తాను ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ, నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తాను అహర్నిశలు శ్రమిస్తానని చెప్పారు.

అనంతరం కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ, నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో కూటమి పార్టీలకు చెందిన మూడు పార్టీల కుటుంబ సభ్యులు పాల్గొనాలని సూచించారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని ఆయా గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులలో స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు నియోజకవర్గ ఇన్చార్జ్ విక్కుర్తి శ్రీనివాస్ ను విధిగా ఆహ్వానించి, భాగస్వామ్యులను చేయాలని కనపర్తి పార్టీ శ్రేణులకు సూచించారు.

కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన తెలుగుదేశం, బిజెపి, జనసేన పార్టీల నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.