భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన డీఎంకే.. కాంగ్రెస్‌తో విభేదాలు
ప్రతిపక్ష ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై చెప్పింది. కాంగ్రెస్‌తో విభేదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 30న కాంగ్రెస్ అధ్యక్షతన జరగనున్న ఇండియా కూటమి సమావేశానికి డీఎంకే హాజరు కావడం లేదని డీఎంకే ప్రతినిధి స్పష్టం చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ తమతో బంధాన్ని తెంచుకుని, అధికార టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చిందని, కేవలం రెండు పదవుల కోసం కాంగ్రెస్ డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని ఆయన విమర్శించారు.
