బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. ఏపీలో మారిన పింఛన్ల పంపిణీ షెడ్యూల్

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..బ్యాంకుల సమ్మె ఎఫెక్ట్.. ఏపీలో మారిన పింఛన్ల పంపిణీ షెడ్యూల్

అక్టోబర్ 1న మధ్యాహ్నం నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

బ్యాంకుల సెలవులు, సమ్మె కారణంగా మారిన షెడ్యూల్

ఉదయం నగదు డ్రా చేసి మధ్యాహ్నం నుంచి పంపిణీకి ఏర్పాట్లు

పింఛన్ల కోసం రూ.2,692 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం

ఏపీలో అక్టోబర్ నెలకు సంబంధించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ సమయంలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ప్రతి నెలా 1వ తేదీ ఉదయం ప్రారంభమయ్యే పింఛన్ల పంపిణీ, ఈసారి మాత్రం మధ్యాహ్నం నుంచి మొదలుకానుంది. ఈ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.