ఆ జిల్లాలకు భారీవర్ష సూచన

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఆ జిల్లాలకు భారీవర్ష సూచన

బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. రేపు అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, యానాంకు రెడ్ అలర్ట్ జారీచేసింది.

తీవ్ర వాయుగుండం.. తీరం దాటేది ఇక్కడే!

బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడనుందని ఐఎమ్ఐ తెలిపింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు రాత్రి లేదా ఎల్లుండి తెల్లవారుజాములోగా విశాఖపట్నం గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల 5 రోజులు ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.