బరువు తగ్గించే మందులపై FDA కీలక హెచ్చరిక.. చూపు కోల్పోయే ప్రమాదం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……బరువు తగ్గించే మందులపై FDA కీలక హెచ్చరిక.. చూపు కోల్పోయే ప్రమాదం

అమెరికా FDA ఓజెంపిక్, వెగోవీ, మౌంజారో సహా GLP-1 తరహా మందుల లేబుళ్లలో కొత్త హెచ్చరికలు చేర్చాలని ఆదేశించింది.

ఈ మందుల వాడకంతో NAION అనే అరుదైన కంటి సమస్య వచ్చే ప్రమాదం పెరగవచ్చని FDA హెచ్చరించింది. ఈ సమస్య వల్ల అకస్మాత్తుగా, నొప్పి లేకుండా చూపు తగ్గడం లేదా శాశ్వతంగా దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంది.

చూపులో అకస్మాత్తుగా మార్పులు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలి. వైద్యుల సలహా లేకుండా ఈ మందుల వాడకాన్ని ఆపకూడదు.

#Ozempic #Wegovy #Mounjaro #FDAWarning