అర్నాబ్, మురసు తుఫాన్ ల కారణంగా జరిగిన పంట నష్టాలపై నివేదికలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏలూరు, నవంబర్, 9 : జిల్లాలో అర్నాబ్, మురసు తుఫాన్ ల కారణంగా జరిగిన పంట నష్టాలపై నివేదికలను వెంటనే సమర్పించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. అర్నాబ్, మురసు తుఫాన్ నష్టాలపై స్థానిక కలెక్టరేట్ నుండి సోమవారం సాయంత్రం వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ మురసు తుఫాన్ కారణంగా జిల్లాలో వివిధ వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయని, వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలను పరిశీలించి, వాటిపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. అర్నాబ్, మురసు తుఫాన్ ల కారణంగా జరిగిన పంట నష్టాలపై నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా కోరిందని, రైతు పేరు, పంట విస్తీర్ణం, పంట రకం, పంట నష్టం వివరాలు, తదితర సమాచారాన్ని శాస్త్రీయంగా లెక్కించి వెంటనే ఆన్లైన్ లో పొందుపరచాలన్నారు. తుఫాన్ల కారణంగా నష్టపోయిన ప్రతీ రైతుకు సంబందించిన పంట నష్టం వివరాలను ఆన్లైన్ లో వెంటనే పొందుపరచాలని కలెక్టర్ వ్యవసాయాధికారులను ఆదేశించారు.

      జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, మండల వ్యవసాయాధికారులు, పాల్గొన్నారు.

(జిల్లా సమాచార శాఖ, ఏలూరు జిల్లా, ఏలూరు వారిచే జారీ చేయబడినది)