భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు…
▪️విశాఖలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ పై చర్చ. సమ్మిట్ ద్వారా భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీల భాగస్వామ్యంపై సమీక్ష.
▪️రాంబిల్లిలో రూ.570 కోట్లతో ఈప్యాక్ డేటా సెంటర్ పరికరాల తయారీ పరిశ్రమకు ఆమోదం.
▪️నాయుడుపేటలో రూ.4 వేల కోట్లతో కార్బన్ కాస్మో బ్యాటరీ తయారీ పరిశ్రమకు ఆమోదం.
▪️తిరుపతిలో రూ.700 కోట్లతో డిక్సన్ టెక్నాలజీస్ పరిశ్రమకు ఆమోదం.
▪️భీమిలి అమనంలో రూ.31,387 కోట్లతో ఏఎం ఇంటెలిజెన్స్ ఏఐ డేటా సెంటర్ కు ఆమోదం.
▪️పశ్చిమగోదావరి తణుకులో రవళి స్పిన్నర్స్ రూ.237 కోట్ల పరిశ్రమ విస్తరణకు ఆమోదం.
▪️నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్కులో హెటెరో గ్రూపునకు 173.82 ఎకరాల కేటాయింపు.
▪️జగ్గయ్యపేటలో 30 ఎకరాల్లో మహిళా పారిశ్రామిక పార్కుకు ఆమోదం.
▪️భోగాపురంలో రిలయన్స్ ఏఐ డేటా సెంటర్కు 24.96 ఎకరాల భూమి.
▪️విజయవాడలో 15 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రతిపాదన.
