భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..స్వర్ణ గ్రామ, వార్డు కోఆర్డినేటర్ల జీతాల పెంపు..
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న కోఆర్డినేటర్లకు ప్రభుత్వం 23% జీతం పెంచింది. దీంతో జిల్లా కో ఆర్డినేటర్ల జీతం రూ.36 వేల నుంచి రూ.44280 కి, అసిస్టెంట్ జిల్లా కో-ఆర్డినేటర్లు, టౌన్ కో- ఆర్డినేటర్ల జీతం రూ.27 వేల నుంచి రూ.33, 210కి పెరగనుంది.2020 లో రిక్రూట్ అయిన వీరికి జీతం పెంచడం ఇదే తొలిసారి.
