భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, స్క్రోలింగ్ 16-11-2026. 9AM.
ఆగ్నేయ, ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం
గడిచిన 6 గంటల్లో 8 కిమీ వేగంతో కదలిక: ప్రఖర్ జైన్, విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో
ప్రస్తుతం చెన్నైకు 720 కి.మీ., విశాఖపట్నంకు 820 కి.మీ.,గోపాల్‌పూర్ కు 940 కి.మీ దూరంలో కేంద్రీకృతం
దక్షిణమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సాయంత్రానికి తుపానుగా బలపడే అవకాశం
రేపు పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తీవ్రతుపానుగా మారే అవకాశం

ఆ తదుపరి 48 గంటల్లో అతి తీవ్ర తుపాన్ గా కోస్తాంధ్ర తీర ప్రాంతానికి చేరుకునే అవకాశం
మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదు : ప్రఖర్ జైన్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో
దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గురు, శుక్రవారాల్లో ఈదురుగాలులతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
సాయంత్రం నుంచి కోస్తా తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురు గాలులు
ప్రజలు, రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి: ప్రఖర్ జైన్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజిఎస్ సిఈవో