బైకులపై సింహాన్ని ఛేజ్ చేశారు.. చివరికి!

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బైకులపై సింహాన్ని ఛేజ్ చేశారు.. చివరికి!

గుజరాత్లోని అంబార్డ్ సఫారీ పార్క్లో అటవీ సిబ్బంది చేసిన పని వారి ఉద్యోగానికి ఎసరు పెట్టింది.

సింబా అనే సింహం వేరే టెరిటరీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు ముగ్గురు సిబ్బంది బైకులపై ఛేజ్ చేశారు.

దీనిపై SMలో తీవ్ర విమర్శలు రాగా వారిని అధికారులు ఉద్యోగం నుంచి తీసేశారు.

సాధారణంగా జీప్లో వెళ్తారని, సేఫ్టీ లేకుండా బైకులపై వెళ్లడాన్ని తప్పుబట్టారు.

అయితే సింహానికి హాని కలిగించే ఉద్దేశం వారికి లేదన్నారు…