భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ….నవంబర్ 20 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు!….
కేంద్ర ప్రభుత్వం నవంబర్ 20 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టే యోచనలో సర్కారు ఉంది. మరోవైపు, ఆగస్టు 13న నిరవధికంగా వాయిదా పడిన వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం అధికారికంగా ముగించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇక డిసెంబర్లో జరగనున్న శీతాకాల సమావేశాలు ఎన్నికల సంఘం పనితీరు, సవరణల వివాదంతో వాడీవేడిగా సాగే అవకాశం ఉందని అంచనా..
