భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్లు….
ఆంధ్రప్రదేశ్లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న 3,967 గ్రామ పంచాయతీలకు నామపత్రాలు స్వీకరించనున్నారు.

జిల్లాల వారీగా తిరుపతిలో అత్యధికంగా 404 పంచాయతీలు, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 66 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 21వ తేదీ తుది గడువుగా నిర్ణయించారు.