భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..చలికాలంలో ఉసిరికాయ తింటే బోలెడు లాభాలు.
చలికాలంలో ఉసిరికాయ తినడానికి మేజర్ రీజన్ ‘ఇమ్యూనిటీ’. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయి.
ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు, జ్వరం లాంటి సీజనల్ రోగాలు ఈజీగా అటాక్ చేస్తాయి.
వ్యాధి కారకాలతో రోగ నిరోధక వ్యవస్థ అంత మెరుగ్గా పోరాడలేకపోవచ్చు. అయితే, ఉసిరిలో పుష్కలంగా ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి ఓ షీల్డ్‌లా పనిచేస్తాయి.
ఇమ్యూనిటీని మెరుగ్గా ఉంచుతాయి. వైట్ బ్లడ్ సెల్స్‌ను యాక్టివేట్ చేస్తాయి. వైరస్‌లు, బ్యాక్టీరియాలపై శరీరం పోరాడే శక్తిని పెంచుతాయి.

దీంతో ఉసిరి తీసుకుంటే చలికాలంలో సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల బారిన పడే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు.