భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..తిరుమల ఘాట్ రోడ్డులో భారీ కొండచిలువ
తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులో కొండచిలువ కలకలం రేపింది. తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో 13వ కిలోమీటర్ వద్ద అటవీ ప్రాంతం నుంచి ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన కొండచిలువను చూసి వాహనదారులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు.

సమాచారం అందుకున్న స్థానిక స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు రంగంలోకి దిగి అత్యంత చాకచక్యంగా ఆ భారీ కొండచిలువను బంధించి, దట్టమైన అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.