భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..శ్రీకాళహస్తి ప్రసాదాల కేంద్రంలో అగ్నిప్రమాదం?
తిరుపతి జిల్లా:నవంబర్ 12
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయ ప్రసాద కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది, దక్షిణ గోపురం పక్కన ఉన్న ప్రసాదాల తయారు కేంద్రంలో గ్యాస్ పేలడంతో పక్కనే ఉన్న ఇతర సిలిం డర్లకు మంటలు వ్యాపించాయి, దీంతో అన్న ప్రసాదం కేంద్రంలో అగ్ని కీలలు భారీగా ఎగిసిపడ్డాయి పేలుడు శబ్దంతో భయాందోళనకు గురైన భక్తులు బయటకు పరుగులు తీశారు.
అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా చుట్టూ మండపాల్లో ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఆలయ ఈవో వెంకటేశులు చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ ప్రసాదాల తయారు కేంద్రాన్ని పరిశీలిం చారు. ప్రస్తుతం ప్రసాదాల తయా రీని నిలిపివేశారు.
ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
