వంట గ్యాస్‌తో ప్రమాదాలు.. బీమా వర్తించాలంటే?

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు….వంట గ్యాస్‌తో ప్రమాదాలు.. బీమా వర్తించాలంటే?

గ్యాస్ సిలిండర్ పేలడంతో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తి నష్టం వాటిల్లుతుంది. ఇలాంటి ప్రమాదాల వల్ల జరిగిన నష్టానికి పరిహారం పొందవచ్చు. బీమా వర్తించాలంటే..

ప్రమాదానికి సంబంధించిన ఆధారాలను నమోదు చేయాలి.

వినియోగదారుడి గ్యాస్ కనెక్షన్ నంబర్, రెగ్యులేటర్, గ్యాస్ పైప్ నంబర్లు సంబంధిత గ్యాస్ కంపెనీ వద్ద రిజిస్టర్ అయి ఉండాలి.

గ్యాస్ కనెక్షన్ మంజూరైన ఇల్లు, స్థలంలోనే గ్యాస్ వినియోగించాలి.

ఏడాది నుంచి రెండేళ్లకు ఒకసారి కనెక్షన్‌ను సంస్థకు చెందిన నిపుణుడితో తనిఖీ చేయించి రికార్డు నమోదు చేయాలి.