భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ.అమరావతి
పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయవాడ మేయర్ వంగవీటి రాధాకృష్ణ!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని విజయవాడ మేయర్‌గా ఎన్నికైన వంగవీటి రాధాకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.
మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంలో రాధాకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఇరువురు నేతల మధ్య పలు అంశాలపై సౌహార్దపూర్వక చర్చ జరిగినట్లు సమాచారం.
విజయవాడ నగర అభివృద్ధి మరియు ప్రజలకు మెరుగైన వసతుల కల్పన దిశగా ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది…
