రాబోయే నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నరసరావుపేటలో సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..రాబోయే నరసరావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నరసరావుపేటలో సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, AR DSP గాంధీ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు నరసరావుపేట పట్టణంలోని నరసరావుపేట రైల్వే స్టేషన్ గేటు నుంచి ఆర్డిఓ ఆఫీస్ మీదగా, క్లాక్ టవర్, మల్లమ్మ సెంటర్ మీదగా, ఆవుల సత్రం నుండి నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ వరకు సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట వన్ టౌన్, టూ టౌన్ ఫిరోజ్ గారు, సురేంద్ర బాబు గారు సీఐ లతో పాటు ట్రాఫిక్ సీఐ లోక నాథ్ గారు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్నికలు యు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అప్రమత్తంగా ఉందని ఈ ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలకు భరోసా కల్పించారు.
పల్నాడు జిల్లా పోలీస్ నరసరావుపేట.