భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..సిద్దిపేట జిల్లాలో బతికున్న 22 మందిని చనిపోయినట్లు చూపిన వైనం
చేర్యాల మండలం రాంపూర్‌లో బతికున్న 22 మంది పేర్లపై మరణ ధృవీకరణ పత్రాలు జారీ కావడం కలకలం రేపింది. 2026 ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు ఈ సర్టిఫికెట్లు జారీ అయినట్లు గుర్తించారు.
ప్రభుత్వ అధికారి వినియోగించాల్సిన ఈ-సైన్ డాంగిల్‌ను గ్రామ పంచాయతీ కార్యదర్శి భుక్య మధు నిర్లక్ష్యంగా వ్యవహరించి, అదే గ్రామానికి చెందిన షేవల్ల రమేష్‌కు అప్పగించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌లో ఇంటర్నెట్ సెంటర్ నిర్వహిస్తున్న రమేష్ ద్వారా అక్రమంగా సర్టిఫికెట్లు జారీ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి.

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి భుక్య మధు, షేవల్ల రమేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన చేర్యాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు