ఆటో డ్రైవర్‌తో పెళ్లి.. రాపిడో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరకు ఇద్దరి ఆత్మహత్య!

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఆటో డ్రైవర్‌తో పెళ్లి.. రాపిడో డ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరకు ఇద్దరి ఆత్మహత్య!

కర్ణాటకలోని మండ్య జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్తతో గొడవల నేపథ్యంలో వివాహిత సహాన (27), తన ప్రియుడు రాహుల్‌తో కలిసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

బెంగళూరులో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరేశ్‌ను సహాన ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.

ఈ క్రమంలో రాపిడో బైక్ డ్రైవర్ రాహుల్‌తో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసినట్లు సమాచారం. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగాయి.

దీంతో రాహుల్‌తో కలిసి మండ్యకు చేరుకున్న సహాన.. ఇండువాల్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున రైలు కిందపడి ప్రాణాలు తీసుకుంది.

రైల్వే పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిదండ్రుల నిర్ణయంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.