ఈనెల 11 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఈనెల 11 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు

పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 11 నుంచి 25 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించేందుకు అవకాశం కల్పించింది. రూ.50 అపరాధ రుసుముతో 26 నుంచి డిసెంబరు 2 వరకు, అపరాధ రుసుము రూ.200తో డిసెంబరు 3 నుంచి 9 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో డిసెంబరు 10 నుంచి 15 వరకు చెల్లించొచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. మూడు కంటే ఎక్కువ సబ్జెక్టులు రాసే రెగ్యులర్ అభ్యర్థులు రూ.125, మూడు సబ్జెక్టుల వరకు రాసే వారు రూ.110, వృత్తివిద్య అభ్యర్థులు అద నంగా రూ.60, నిర్ణీత వయసు నిబంధనలకు మినహా యింపు కోరే విద్యార్థులు వయోపరిమితి సడలింపు రుసు ముగా రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.