న్యూస్ ఛానల్ 2వ వార్షికోత్సవం లో ప్రసంగించిన కల్లుపల్లి సురేంధర్ రెడ్డి

పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ ఛానల్ 2వ వార్షికోత్సవం లో ప్రసంగించిన కల్లుపల్లి సురేంధర్ రెడ్డి

భారత్ డిజిటల్ న్యూస్*తిరుపతి హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన జర్నలిజం ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026, బతుకమ్మ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథులు గా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి కల్లుపల్లి సురేంధర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం రంగంలో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, అనాధా వృద్ధశ్రమాలకు వికలాంగుల సేవా సంస్థలకు తమ సంపాదనలో నుంచి తమ వంతు సాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలిచిన వారి సేవలను గుర్తించి, పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ ఛానల్ 2వ వార్షికోత్సవం, పీపుల్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగిన జర్నలిజం ఎక్సలెన్స్ అవార్డ్స్ 2026, బతుకమ్మ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అందులో కల్లుపల్లి సురేంధర్ రెడ్డి మాట్లాడుతూ జర్నలిజం, సేవా రంగం ఈ రెండూ దాదాపు ఒకే పయనం, కానీ ఈ రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం అంత సులభం కాదని, ఇలాంటి సవాలుతో కూడిన పరిస్థితుల్లో కూడా సంపత్ రెడ్డి ఈరోజు మీడియా రంగంలో ద్వితీయ వార్షికోత్సవాన్ని జరుపుకుంటు అదేవిధంగా సేవా రంగంలో కూడా తనదైన శైలిలో, పెద్దలు, హితులు, సన్నిహితుల సహకారంతో ఈనాడు ఆయన ముందడుగు వేస్తున్నారని, జర్నలిజంలో కావాల్సింది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా ఉండడమే కాకుండా సేవా రంగంలో కూడా ఒక అడుగు ముందుకు వేస్తే మంచి జరుగుతుందని అనడానికి నిదర్శనమే.. ఈరోజు మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, సాధారణంగా మనుషులు ఆపదల్లో లేదా కష్టాల్లో ఉంటే ఏవైనా అడ్డంకులు ఎదురవుతాయి. కానీ, అలాంటి పరిస్థితులకు పూర్తిగా లొంగిపోకుండా, ప్రజా సేవలో ఉంటూ, ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం శ్రమిస్తూ ముందుకు వెళ్తున్న సంపత్ రెడ్డికి ప్రతి ఒక్కరూ చేదోడు వాదోడుగా నిలవాలని ఆకాంక్షించారు. ఇంతటి ఘనమైన కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నిర్వాహకులకు మరోసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాని సురేంధర్ రెడ్డి తెలిపారు.