భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..వామ్మో వీడు మాములోడు కాదు బాబోయ్….చాక్లెట్ ట్యూబుల్లో రూ.24.5 కోట్ల కొకైన్
దోహా నుంచి హైదరాబాద్ వచ్చిన భారతీయ ప్రయాణికుడి నుంచి 4.9 కిలోల కొకైన్‌ను DRI హైదరాబాద్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.24.5 కోట్లు ఉంటుందని వెల్లడించారు. ఏడు Lindt Lindor చాక్లెట్ ట్యూబుల్లోని 207 క్యాప్సూల్స్‌లో డ్రగ్స్ దాచినట్లు గుర్తించారు. ప్రయాణికుడిని NDPS Act-1985 కింద అరెస్ట్ చేయగా తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.
