సచివాలయం సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి

సచివాలయం సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి

భారత్ డిజిటల్ న్యూస్ 01/10/2026( పాకాల ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి ఆదేశాల మేరకు కావలివారి పల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం సింగల్ విండో చైర్మన్ కృష్ణ మని సావిత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రతి నెలా 1వ తేదీనే ఉదయం 6:30 గంటల నుంచే నేరుగా ఇళ్ల వద్దనే అందజేస్తున్నామని కృష్ణమనేని సావిత్రి తెలిపారు. బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఉందని ఆందోళనతో ఉన్న గ్రామస్తులు పింఛన్లు ఆలస్యం అవుతుందేమో నని ఆందోళన వద్దని రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుగానే పింఛన్ల పంపిణీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిధులను విడుదల చేశారని
అక్టోబర్ నెల పింఛన్ల కోసం రూ.2,692.34 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది . రాష్ట్రంలోని 61.80 లక్షల మంది పింఛనుదారులకు 1వ తేదీన ఉదయం అందరికీ అందిస్తున్నామని అలాగే కావలివారిపల్లి కుడా ఇస్తున్నామని ఎవరు ఆందోళన చెందొద్దని ఎటువంటి ఇబ్బందులు ఉన్న మా దృష్టికి తేవాలని తెలిపారు సచివాలయ సిబ్బందితో కలిసి సమస్యలు అడిగి తెలుసుకుంటూ పింఛన్లు పంపిణీ చేసిన కృష్ణమనేని సావిత్రి