హోటళ్లలో దేశీయ గ్యాస్ సిలిండర్ల వినియోగం.. పట్టించుకోని పౌరసరఫరాల అధికారులు?

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..హోటళ్లలో దేశీయ గ్యాస్ సిలిండర్ల వినియోగం.. పట్టించుకోని పౌరసరఫరాల అధికారులు?

హోటళ్లు, వాణిజ్య సంస్థల్లో వాణిజ్య అవసరాలకు ఉపయోగించాల్సిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు బదులుగా దేశీయ (Domestic) గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హోటళ్లలో పెద్ద సంఖ్యలో దేశీయ సిలిండర్లు వినియోగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశీయ గ్యాస్‌ను వాణిజ్య అవసరాలకు వినియోగించడం నిబంధనలకు విరుద్ధమైతే, దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వినియోగదారులు కోరుతున్నారు.

ముఖ్యం గా గుంటూరు నగరం లో అమరావతి రోడ్, గుజ్జనగుండ్ల, చిన్న హోటల్ లలోనే కాకుండ బృందావన్ గార్డెన్స్ లో పెద్ద రెస్టారెంట్ లో సైతం డోమెస్టిక్ గ్యాస్ సిలిండర్ లను వాడటం విడ్డురం గా వున్నా అధికారులు మాత్రం మామూళ్లకు అలవాటు పడ్డారా లేక అధికారానికి భయపడుతున్నారా అని ప్రజలకు అర్ధం కావట్లేదు.

పౌరసరఫరాల శాఖ అధికారులు స్పందించాలి: హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల్లో గ్యాస్ సిలిండర్ల వినియోగంపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టి నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. దేశీయ సిలిండర్లను అక్రమంగా వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నట్లు తేలితే సంబంధిత సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పర్యవేక్షణ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.