నలుగురు CISF సిబ్బందిని కాల్చిచంపిన జవాన్‌

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..నలుగురు CISF సిబ్బందిని కాల్చిచంపిన జవాన్‌

జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో సీఐఎస్‌ఎఫ్ క్యాంపులో ఇద్దరు జవాన్ల మధ్య జరిగిన గొడవ నలుగురు తోటి సిబ్బంది మరణానికి దారితీసింది. ఒక జవాను విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో అసిస్టెంట్ కమాండెంట్‌తో సహా నలుగురు సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది మృతి చెందారు. ఈ ఘటన మష్కా గ్రామంలోని సేవా-III విద్యుత్ ప్రాజెక్టు వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో చోటుచేసుకుంది.