భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తెలుగు రాష్ట్రాల్లో మూడురోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయి. ఆంధ్రప్రదేశ్లో మోస్తరు వర్షాలు, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి.

రాయలసీమలో గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడవద్దని అధికారులు సూచించారు…..