పల్లె పండుగ 3.0″ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కామినేని

ఏలూరు జిల్లా ముదినేపల్లి::::::భారత్ డిజిటల్ న్యూస్ ప్రతినిధి::::: పల్లె పండుగ 3.0″ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కామినేని పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈరోజు పెదపాలపర్రు గ్రామ శివారు చిన్న పత్తిపాడు గ్రామంలో సిసి రోడ్లు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, చల్లగుళ్ళ శోభనాద్రి చౌదరి, వారి తనయుడు ఆదిత్య చౌదరి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని గత ప్రభుత్వంలో అభివృద్ధి నిర్వీర్యం అయిందని ప్రతి గ్రామానికి త్రాగునీరు, వీధి దీపాలు,సి. సి. రోడ్లు, పోలవరం పట్టిసీమ ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతర కృషి చేస్తూ మంచి తాగునీరు అందిస్తున్నారని, నిరంతరం ప్రజాసేవలో చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి, ఆదిత్య చౌదరి, ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధి ద్యేయంగా, ప్రజలకు తమ వంతుగా సహాయ సహకారాలు అందిస్తూగ్రామాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు రాష్ట్రంలోనే 14వ స్థానంలో అభివృద్ధి లో వున్న మన కైకలూరు నియోజకవర్గం,మీ అందరి మద్దతుతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నానని, నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని,అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నియోజకవర్గ కన్వీనర్ కొత్త నాగేంద్ర కుమార్, బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్ బొంగు రవి, జనసేన నాయకుడు ఏ. ఎన్.బాబు, పెదపాలపర్రు గ్రామ మాజీ సర్పంచ్ గంటా రాకేష్ కుమార్, ఎలిశెట్టి లక్ష్మీ నరసింహారావు, ఎంపీడీవో వైరామకృష్ణ, ఎమ్మార్వో ఎస్ లతీఫ్ పాషా, గ్రామ సచివాలయ సిబ్బంది, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అధికారి హేమంబరధరరావు, గ్రామ ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు