భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం.విధుల్లో నిర్లక్ష్యం: వంగర తహసీల్దార్, వీఆర్వో, వీఆర్ఏలపై సస్పెన్షన్ వేటు
విజయనగరం కలెక్టర్ కఠిన నిర్ణయం
ఇన్ఛార్జ్ తహసీల్దార్‌గా శ్రీనివాసరావు నియామకం
విజయనగరం, జిల్లా సెప్టెంబర్ 26 టైమ్స్ పవర్
అధికారిక బాధ్యతల్లో నిర్లక్ష్యం వహిస్తూ, విధులకు అలసత్వం ప్రదర్శించిన రెవెన్యూ అధికారులపై విజయనగరం జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వంగర తహసీల్దార్ రామారావుతో పాటు సంగాం వీఆర్వో రామచంద్రరావు, వంగర వీఆర్ఏ ఉదయ్ కిరణ్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, అత్యవసర విధుల్లో అలసత్వం వహించినట్లు సదరు అధికారులపై వచ్చిన ఫిర్యాదులు, ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా కలెక్టర్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
కొత్త ఇన్ఛార్జ్ నియామకం
తహసీల్దార్ రామారావు సస్పెన్షన్‌తో వంగర మండల పరిపాలన సజావుగా సాగేందుకు వీలుగా ప్రభుత్వం తక్షణ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రీ సర్వే డీటీ (డిప్యూటీ తహసీల్దార్) గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావును వంగర ఇన్ఛార్జ్ తహసీల్దార్‌గా నియమిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన తక్షణమే బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
