పెండింగ్‌ చలాన్లను కరెంట్‌ బిల్లులతో అనుసంధానం

భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం.పెండింగ్‌ చలాన్లను కరెంట్‌ బిల్లులతో అనుసంధానం

పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల వసూళ్లపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది.

ఈ-చలాన్లు జారీ చేయడం మాత్రమే కాకుండా.. బకాయిల వసూళ్లకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది.

పెండింగ్‌ చలాన్లను కరెంట్‌ బిల్లులతో అనుసంధానించే అంశాన్ని కూడా పరిశీలించాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా సుమారు రూ.45 వేల కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉండగా.. రూ.25 వేల కోట్లు మాత్రమే రికవరీ అయినట్లు కోర్టుకు వెల్లడైంది.

వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్, PUC, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లపై ఆంక్షలు.. వాహనాల జప్తు వంటి మార్గాలపైనా చర్చ!