బంగాళాఖాతంలో మరో వాయుగుండం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..బంగాళాఖాతంలో మరో వాయుగుండం

మయన్మార్-అండమాన్ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఇది రాగల 12 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు ఈశాన్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం 72 గంటల్లో ఈశాన్య బంగ్లాదేశ్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.