అయోధ్య రామ దర్శనం మనగ్రామానికే 🕉️

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అయోధ్య రామ దర్శనం మనగ్రామానికే 🕉️
జై శ్రీరామ్ 🙏🚩*
అయోధ్యకు వెళ్లి శ్రీరాముని దర్శనం చేసుకోలేని భక్తుల కోసం ఏకల్ అభియాన్ ఆధ్వర్యంలో శ్రీరాముని విగ్రహాలను రథంపై మన గ్రామానికి తీసుకువచ్చారు.
“అయోధ్యకు రాలేని భక్తుల ఇంటికే శ్రీరాముడు స్వయంగా వస్తున్నాడు” అనే పవిత్ర భావనతో ఈ రథయాత్ర నిర్వహించబడుతోంది. 🙏
📍 ప్రారంభం: బడే వారి శ్రీ రామాలయం వద్ద
🕕 సమయం: రేపు సాయంత్రం 6 గంటలకు
శ్రీరాముని విగ్రహాలతో అలంకరించిన ఈ రథం ఊరేగింపుగా ఇంటింటికీ రానుంది. ప్రతి ఇంటివారు భక్తిశ్రద్ధలతో రథానికి స్వాగతం పలికి, శ్రీరాముని ఆశీస్సులు పొందాలని మనవి.
భక్తులు తమకు తోచిన విధంగా పసుపు,కుంకుమ
పూలు,పండ్లు
కొబ్బరికాయలు, కానుకలు

సమర్పించి ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు.
గ్రామ ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని మనవి.
🚩 జై శ్రీరామ్ 🚩
ఏకల్ అభియాన్