డ్రైవింగ్ లైసెన్స్‌దారులకు అలర్ట్.. గాబరా వద్దు!

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..డ్రైవింగ్ లైసెన్స్‌దారులకు అలర్ట్.. గాబరా వద్దు!

మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే లైసెన్స్ రద్దవుతుందన్న ప్రచారం అవాస్తవం

తెలంగాణ: డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేయించుకోవాలని, ఈ నెలాఖరులోగా నంబర్‌ లింక్ చేయించుకోకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ ప్రచారంపై వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. మొబైల్ నంబర్ లింక్ చేయలేదనే కారణంతో డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేసే నిబంధన ప్రస్తుతం లేదని వెల్లడించారు.

అయితే డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా రవాణా శాఖకు సంబంధించిన సమాచారం, OTPలు, ఇతర సేవల వివరాలు సులభంగా పొందవచ్చు. కాబట్టి వాహనదారులు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకుండా, అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచిస్తున్నారు.