దశాబ్దాల ULC పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..దశాబ్దాల ULC పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

GO 455, 456, 747, 92 కింద పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి, అర్హమైన కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని అధికారులను ఆదేశించింది.

ULC కేసుల పరిష్కారం కోసం Memo No.48062 జారీ చేసినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

GO 118, GO 76 ప్రకారం 22-A జాబితాలో ఉన్నప్పటికీ అవసరమైన అనుమతులున్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించింది.

మిగిలిన 22-A భూ సమస్యలను కూడా ఒక్కొక్కటిగా ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.