భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అక్టోబర్ 1 నుంచి భారీగా పెరగనున్న ఎలక్ట్రానిక్స్ ధరలు
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషిన్ల ధరలు 3% నుండి 10% వరకు పెరగనున్నాయి. ముడి సరుకులు, రవాణా ఖర్చులు పెరగడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఏసీల ధరలు 5-10%, టీవీలు, వాషింగ్ మెషిన్ల ధరలు 3-7% వరకు ప్రియం కానున్నాయి.
