భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.ఉగ్రవాద దేశమే నన్ను ప్రశ్నిస్తోంది: పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ కౌంటర్
ఐక్యరాజ్యసమితి 81వ సర్వసభ్య సమావేశం సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఘాటుగా స్పందించారు. ‘పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడాన్ని భారత్ ఎప్పుడు ఆపుతుంది?’ అని ప్రశ్నించగా.. ‘ఉగ్రవాద దేశమే నన్ను ఆ ప్రశ్న అడుగుతోంది’ అని జైశంకర్ బదులిచ్చారు. యూఎన్‌లో భారత శాశ్వత ప్రతినిధి హరీశ్ పర్వతనేని కూడా జోక్యం చేసుకుని.. జైశంకర్ సమాధానం స్పష్టంగా ఉందని తెలిపారు.
