రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు మంజూరు

తెలంగాణ : రాష్ట్రంలో కొత్తగా 200 జూనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కింది కోర్టుల్లో పేరుకుపోయిన పెండింగ్ కేసుల పరిష్కారానికై ఈ కోర్టులను మంజూరు చేయాలన్న హైకోర్టు రిజిస్ట్రీ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం, మొదటి విడతగా 200 కోర్టులను మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి బి.పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాకు కోర్టుల కేటాయింపు జరిగింది.