రాష్ట్ర ప్రజలకు గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు: మంత్రి పొన్నం…

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రాష్ట్ర ప్రజలకు గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు: మంత్రి పొన్నం…

తెలంగాణ : హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేలా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పోలీస్, GHMC, ట్రాఫిక్, విద్యుత్, వైద్య, రవాణా, HYDRAA తదితర శాఖలను అప్రమత్తం చేసి, భక్తుల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతో నిమజ్జన శోభాయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు గణేష్ నిమజ్జన శుభాకాంక్షలు తెలిపారు.