హైదరాబాద్‌ మహానగరంలో అత్యంత వైభవంగా సాగుతున్న వినాయక నిమజ్జన

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..హైదరాబాద్‌ మహానగరంలో అత్యంత వైభవంగా సాగుతున్న వినాయక నిమజ్జన శోభాయాత్ర సరళిని, భద్రతా ఏర్పాట్లను నగర ఇన్‌ఛార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నతాధికారులతో కలిసి ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు.

శుక్రవారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన వీరు.. హుస్సేన్‌సాగర్‌ పరిసరాలతో పాటు నగరంలోని ప్రధాన ఊరేగింపు మార్గాలను, భక్తుల రద్దీని, ట్రాఫిక్‌ సరళిని వీక్షించారు.

ఈ ఏరియల్‌ సర్వేలో మంత్రి గారితో పాటు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌, హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్‌, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ ప్రియాంక ఆలా పాల్గొన్నారు.