భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఐ బొమ్మ రవి బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్.. కోర్టు ఆదేశాలు..
ఐ బొమ్మ రవికి నాంపల్లి కోర్టులో కొంత ఊరట లభించింది. పోలీసులు సీజ్ చేసిన రవి బ్యాంకు ఖాతాలను లావాదేవీల కోసం ఉపయోగించుకోవచ్చని కోర్టు సూచించింది. అయితే, ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్ల నగదును అన్‌ఫ్రీజ్ చేయడానికి మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని, తన ఖాతాల్లోని నగదును ఉపయోగించుకునేందుకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని రవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
