శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం

తిరుమల :

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజులో 67,632 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 24,909 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.91 కోట్లుగా నమోదైంది.